"A Mother is she who take the place of all others But whose place no one else CAN take"
అమ్మ. . . !
చేతిలో కిలో బరువు పట్టుకొని సరిగ్గా పది నిముషాలు నిలపడడానికే నానా తంటాలు పడతాం. కానీ, అమ్మ మనల్ని పది నెలలు మోస్తుంది. కష్టంతో, బాధతో కాదు. ఇష్టంతో, ప్రేమతో.
లోపల నుండి అమ్మని తంతూ వుంటాం. అదేంటో, నొప్పి రావాలి కానీ అమ్మ మొహం మీద మాత్రం నవ్వే వస్తుంది.
ఒక రోజు బయటికి రానే వస్తాం. ప్రతి సంవత్సరం ఆ రోజున మనం Cake కొయ్యడానికి, Party లు చేసుకోవడానికి అమ్మ మనకిచ్చిన Official license అన్న మాట.
మనతో అడుగులో అడుగేస్తూ, కింద పడకుండా చూస్తూ నడక నేర్పిస్తుంది. School లో running race లో Cup కొట్టడానికి తనిచ్చిన Fees లేని Foundation Training అది.
ఎంత Comedy కాకపోతే, తనే ఒక దేవత. అయినా మళ్ళీ పూజగదిలో కూర్చొని వేరే దేవుళ్ళకి మొక్కుతుంది. అప్పుడు కూడా తన కోసం కాదు, మనం బాగుండాలనే.
మన కోసం పుస్తకాల్లో, TV ల్లో చూసి, నేర్చుకొని మరీ, మంచి మంచి వంటలు చేస్తుంది, తినిపిస్తుంది. తిన్నాక మూతి కూడా ప్రేమతో తుడుస్తుంది.
అమ్మకు నిద్రొస్తున్నా, మనకి నిద్ర రావడానికి కధలు చెబుతుంది, వచ్చే వరకూ "జో" కొడుతుంది.
Market కి తీసుకెళుతుంది. పాపం తను దాచుకున్న చిల్లరతో ఏదో కొనుక్కోవడానికి వెళుతుంది. అంతలోనే మనం "అమ్మా!" అని ఒక ఎర్ర Balloon వైపు చూపిస్తాం. Cut చేస్తే, తన చేతిలో చిల్లర ఖాళీ అవుతుంది. మన చేతిలో Balloon ఉంటుంది.
అలా అలా... జీవితాన్ని 24x speed లో పెడితే,
ఒక రోజు, నీకొక మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేస్తుంది.
నువ్వు వేరుగా వుంటానంటే కూడా అడ్డుపడదు. నీ సుఖం కోసమే.
కొన్ని సంవత్సరాల తరువాత, ఒకప్పుడు ఎంతో చురుకుగా, చలాకీగా ఉండే అమ్మ ఇప్పుడు కొంచెం మెల్లగా, నీరసంగా, తల మీద తెల్ల జుట్టుతో వుంటుంది.
అమ్మ దగ్గుతుంది. "అదేంటమ్మా?" అని అడిగితే "ఏం లేదు. వంట చేసేటప్పుడు కొంచెం Masala ఎక్కువ వాడాను" అని అంటుంది. అది అబద్ధం కాకపోవచ్చు. అలా అని...ఆ వయసులో, నిజం కూడా కాకపోవచ్చు.
వేగంగా పరిగెత్తే కాలానికి జాలి, దయ వుండదు.
భవిష్యత్తులో ఒక రోజు. అయ్యో, అమ్మని ఇంకా బాగా చూసుకొనివుండాల్సిందే అని అనుకునే సమయానికి, గోడ మీద ఒక పెద్ద Frame, అందులో, మనల్ని అందరికంటే ప్రేమగా, ఏమీ ఆశించకుండా, ఎంత పెద్ద తప్పు చేసినా క్షమించే ఒక అందమైన మొహం వుంటుంది. అప్పుడు తెలుస్తుంది అమ్మ అంటే ఏంటో. ఈ రోజు నేను ఇది రాసినా, అది మీరు చదువుతున్నా, మనం ఇక్కడున్నాం అంటే, అది అమ్మ వల్లనే.
నిజాలు మాట్లాడుకుందాం.
Girlfriend పుట్టినరోజుకి పదివేలు పెట్టైనా కుక్క పిల్లని కొనివ్వచ్చు అని అనుకునేవాళ్ళు ఉంటున్నారు కానీ, అమ్మ పుట్టిన రోజున ఒక LIC policy అయినా చేయించాలి అని అనుకునేవాళ్ళు ఎంతమంది వుంటున్నారు?
ఈ రోజుల్లో, మనందరం Facebookలో, Phoneల్లో, Coffee shopల్లో కంటే అమ్మతో ఎక్కువసేపు గడుపుతున్నామా? Yes అయితే అదృష్టవంతులం. No అయితే కేవలం status లు, Like లు, Share లు కాకుండా, అమ్మతో గడపడం మొదలుపెడదాం.
Mothers day అంటూ wall ని నింపేయ్యొద్దు. వెళ్ళి అమ్మని గట్టిగా కౌగిలించుకుందాం, లేదంటే దూరంగా వుంటే ఆ రోజంతా మనస్ఫూర్తిగా తనకోసం వీలయినంత సమయం కేటాయిద్దాం.
సూర్యుడిని, భూమిని, అమ్మని అభినందించడానికి ఫలానా రోజు, ఖచ్చితమైన కారణం అవసరం లేదు.
- Phanindra Narsetti
Comments
Post a Comment